Sudheer Babu: మహేశ్ చేతుల మీదుగా 'శ్రీదేవి సోడా సెంటర్' ట్రైలర్ రిలీజ్!

Sridevi Soda Center Official Trailer Released
  • ఓ పల్లెటూరి ప్రేమకథ 
  • ప్రేమకు అడ్డుపడే పెద్దలు 
  • పరువు కోసం పన్నాగాలు 
  • ఈ నెల 27వ తేదీన విడుదల
సుధీర్ బాబు - ఆనంది జంటగా 'శ్రీదేవి సోడా సెంటర్' రూపొందింది. విజయ్ చిల్లా - దేవిరెడ్డి శశి నిర్మించిన ఈ సినిమాకి , కరుణకుమార్ దర్శకత్వం వహించాడు. గ్రామీణ నేపథ్యంలో సూరిబాబు - శ్రీదేవి అనే జంట మధ్య సాగే అందమైన ప్రేమకథ ఇది. ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన థియేటర్లకు తీసుకురానున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మహేశ్ బాబు చేతుల మీదుగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఇప్పటివరకూ సినిమాకి సంబంధించిన ఆటపాటలు  .. అల్లరి చూపిస్తూ వచ్చారు. కానీ ఈ సారి రొమాన్స్ తో పాటు యాక్షన్ .. ఎమోషన్ చూపించారు.

ప్రేమ .. పెళ్లి .. ఈ మధ్యలో పరువు సృష్టించే గొడవలు ఈ ట్రైలర్ లో చూపించారు. ప్రేమకి పెద్దలు ఎదురుతిరగడం .. కథానాయకుడు తన ప్రేమకోసం ఎంతకైనా తెగించడం ట్రైలర్ లో ఆవిష్కరించారు. డైలాగ్స్ కూడా బాగున్నాయి. కంటెంట్ చూస్తుంటే యూత్ ను .. మాస్ ను ఒక రేంజ్ లోనే ఆకట్టుకునేలా అనిపిస్తోంది.
Sudheer Babu
Anandi
karuna Kumar

More Telugu News