Haiti: హైతీ భూకంప విలయంలో 1,297కు చేరిన మృతుల సంఖ్య

Death toll in Haiti earthquake climbs to 724

  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
  • ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే
  • రాత్రంతా రోడ్లపైనే గడిపిన జనం
  • క్షతగాత్రులతో కిక్కిరిసిపోయిన ఆసుపత్రులు

కరీబియన్ దేశం హైతీలో శనివారం సంభవించిన భారీ భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య నిన్నటికి 1,297కు పెరిగింది. 2,800 మంది గాయపడ్డారు. మరెంతోమంది నిరాశ్రయులయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భూకంపం ధాటికి వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాజధాని పోర్టౌ ప్రిన్స్‌కు పశ్చిమాన 125 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 7.2 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం పెను విలయాన్నే సృష్టించింది.

శనివారం రోజంతా ప్రకంపనలు వణికించగా, నిన్న తెల్లవారుజామున కూడా భూమి ఆరుసార్లు కంపించింది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ రాత్రంతా వీధుల్లోనే గడిపారు. తీరప్రాంత పట్టణమైన లెస్‌కేయస్‌ తీవ్రంగా దెబ్బతింది. క్షతగాత్రులను ఇక్కడి నుంచి రాజధానికి తరలించేందుకు మాజీ సెనేటర్ ఒకరు ప్రైవేటు విమానాన్ని ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యుల్ని, ఆత్మీయుల్ని పోగొట్టుకున్న వారి రోదనలతో ఎక్కడ చూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. క్షతగాత్రులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. కాగా, 2010లో ఇక్కడ సంభవించిన భారీ భూకంపం కారణంగా 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

Haiti
Earthquake
Port-au-Prince
  • Loading...

More Telugu News