Simbu: వైరల్ అవుతున్న శింబు కొత్త లుక్

Simbu new look went viral

  • 'వెందు తానింధతు కాదు' చిత్రంలో శింబు
  • గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చిత్రం
  • ఇటీవల ఫస్ట్ లుక్ విడుదల
  • తాజాగా మరో పిక్ పంచుకున్న శింబు

తమిళ హీరో శింబు డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ప్రస్తుతం ఈ డ్యాన్సింగ్ స్టార్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 'వెందు తానింధతు కాదు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం శింబు తన రూపాన్ని విభిన్నరీతిలో మార్చుకున్నాడు. ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా, అందులో కనిపిస్తోంది శింబు అంటే నమ్మలేకపోయారు. ఈ క్రమంలో శింబు తాజా లుక్ వైరల్ అవుతోంది. తాజా ఫొటోలో శింబు ఓ సెల్ఫీ తీసుకుంటున్నట్టుగా దర్శనమిస్తున్నాడు.

గౌతమ్ మీనన్ చిత్రాలు మిగతా దర్శకుల చిత్రాలతో పోల్చితే ఎంతో భిన్నంగా ఉంటాయి. అందుకే ఈ సినిమా కోసం శింబు చాలా కష్టపడ్డాడు. ఏకంగా 30 కేజీల బరువు తగ్గి కొత్తగా కనిపిస్తున్నాడు. తన నయా గెటప్ ను శింబు సోషల్ మీడియాలో పంచుకోగా, అభిమానులు విస్మయానికి గురవుతున్నారు.

Simbu
New Look
Vendu Tanindathu Kadhu
Gautam Menon
Kollywood
  • Loading...

More Telugu News