Taneti Vanita: ఏపీ మంత్రి తానేటి వనిత ఇంట విషాదం

vanita mother passes away

  • వనిత‌ తల్లి సుశీల(76) క‌న్నుమూత‌
  • అనారోగ్య కారణాలతో రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస‌
  • ప‌లువురి పరామ‌ర్శ‌

ఏపీ మంత్రి తానేటి వనిత ఇంట విషాదం నెలకొంది. గ‌త‌ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వనిత తల్లి జొన్నకూటి సుశీల (76) క‌న్నుమూశారు. రాజమండ్రిలో ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో ఆమె చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తానేటి వనిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ మహిళా స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న విష‌యం తెలిసిందే. ఆమెకు మాతృవియోగం కలిగిన విష‌యం తెలుసుకున్న ప‌లువురు నేత‌లు ఆమెను ప‌రామ‌ర్శించారు.

Taneti Vanita
Andhra Pradesh
  • Loading...

More Telugu News