: ఈ టమోటాలు మరింత రుచికరం!


మన కూరలకు మరింత రుచిని చేకూర్చేందుకు టమోటాలను అందులో చేరుస్తాం. అయితే తమ కొత్త రకం టొమోటాల వల్ల మన కూరలకు మరింత రుచి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు... ఈ కొత్త రకం టొమోటోలు మరింత ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటాయట.

పర్పుల్‌ రంగు (ఊదా రంగు)లో ఉండే టమోటాలు సుమారు 21 నుండి 48 రోజుల వరకూ నిల్వ ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ రంగు టమోటాలు వంటలో మరింత రుచిని అందిస్తాయని చెబుతున్నారు. ఈ రకం టమోటాలను క్యాన్సర్‌ వ్యాధిని ఎదుర్కొంటున్న ఎలుకలపై ప్రయోగించారు. పర్పుల్‌ రంగు టమోటాలను జన్యు మార్పిడి ద్వారా శాస్త్రవేత్తలు పండించారు. ఈ పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసర్‌ కేథీ మార్టిన్‌ మాట్లాడుతూ టమోటాలను పండించే వారికి మరిన్ని కొత్త రకం టమోటాల సాగుకు అవకాశం కల్పించడంతోబాటు, అటు వినియోగదారులకు మంచి రుచికరమైన టమోటాలను అందుబాటులోకి తేవడమే తమ పరిశోధనల ముఖ్య ఉద్దేశమని అంటున్నారు. ఈ కొత్త రకం టమోటాలు వినియోగదారులకు ఎక్కువ కాలం నిల్వ ఉండడమే కాకుండా వంటలో మరింత రుచిని ఇస్తాయని ఆమె చెబుతున్నారు.

  • Loading...

More Telugu News