Sunil Deodhar: మీ ప్రభుత్వానికి మీరే పాతాళమంత లోతు గొయ్యి తవ్వి రెడీగా ఉంచారు: పేర్ని నానిపై సునీల్ దేవధర్ విమ‌ర్శ‌లు

sunil deodhar slams nani

  • మీ ప్రభుత్వాన్ని మేం కూల్చనవసరం లేదు
  • ఆ ఆలోచన కూడా మాకులేదు
  • కేంద్రం అప్పులు చేసినా కోట్ల మందికి ఉచితంగా రేషన్, వ్యాక్సిన్ ఇస్తోంది
  • కేంద్ర ప్రభుత్వంతో మీకు పోలికేంటి?

వైఎస్ జ‌గ‌న్ స‌ర్కారుని కూల్చే కుట్ర‌లు బీజేపీ చేస్తోందంటూ ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్య‌లకు సంబంధించి ఓ దిన‌ప‌త్రిక‌లో వచ్చిన వార్తను పోస్ట్ చేస్తూ.. ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్చార్జి సునీల్ దేవధర్ కౌంట‌ర్ ఇచ్చారు.

'పేర్ని నాని గారు.. మీ ప్రభుత్వాన్ని మేం కూల్చనవసరం లేదు, ఆ ఆలోచన కూడా మాకులేదు. ఏ క్షణాన బెయిల్ రద్దవుతుందో తెలియక, రోజు గడవడానికి అప్పు పుట్టక, రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టి, అది చాలదన్నట్టు వేలకోట్ల రూపాయ‌ల‌ అవినీతి చేసి మీ ప్రభుత్వానికి మీరే పాతాళమంత లోతు గొయ్యి తవ్వి రెడీగా ఉంచారు' అని సునీల్ దేవ‌ధ‌ర్ పేర్కొన్నారు.

'కేంద్రం అప్పులు చేసినా కోట్ల మందికి ఉచితంగా రేషన్, వ్యాక్సిన్ ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో మీకు పోలికేంటి? కేంద్రానికున్న ఆర్థిక స్తోమత, వెసులుబాటు మీ ప్రభుత్వానికున్నాయా? మీలా పప్పు బెల్లాలు పంచడానికి అప్పులు చేయడం లేదు. మేం దేశ ప్రతిష్ఠ‌ పెంచుతుంటే మీరు రాష్ట్రాన్ని ముంచుతున్నారు' అని సునీల్ దేవధర్ విమ‌ర్శించారు.

Sunil Deodhar
Perni Nani
Andhra Pradesh
  • Loading...

More Telugu News