cbse: సీబీఎస్ఈ పదవ తరగతి ఫలితాలు విడుదల
![cbse 10th results out](https://imgd.ap7am.com/thumbnail/cr-20210803tn6108eee8b1413.jpg)
- cbseresults.nic.in వెబ్సైట్లో ఫలితాలు
- రోల్ నంబర్‌తో పాటు స్కూల్ కోడ్‌ను ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు
- ఇప్పటికే 12వ తరగతి ఫలితాలూ విడుదల
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. 99.04 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. cbseresults.nic.in వెబ్సైట్లో ఈ ఫలితాలు సందర్శించవచ్చన్నారు. ఫలితాల కోసం విద్యార్థులు తమ రోల్ నంబర్‌తో పాటు స్కూల్ కోడ్‌ను కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
కాగా, దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో సీబీఎస్ఈ పదవ తరగతితో పాటు 12వ తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో మార్కుల విడుదల కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించుకుని ఫలితాలు ప్రకటించారు. ఇప్పటికే 12వ తరగతి ఫలితాలను విడుదల చేశారు. దాదాపు పరీక్ష ఫీజులు కట్టిన విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యారు.