: ద్రవిడ్ ఐపీఎల్ కు గుడ్ బై చెప్పనున్నారా?


భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియా గ్రేట్ వాల్ తాజా పరిణామాలతో విసిగిపోయాడా? లేక ఆడి ఆడి అలసిపోయాడా? వయసైపోయింది కనుక ఇక ఆడొద్దనుకుంటున్నాడా? అన్నీ సమాధానం లేని ప్రశ్నలే. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ద్రవిడ్ కేవలం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. స్ఫూర్తిదాయక ఆటతీరుతో ఐపీఎల్ 6లో మూడో స్థానంలో తన జట్టుని నిలిపి, ఛాంపియన్స్ లీగ్ కు అర్హత సాధించడంలో కీలక పాత్ర పోషించాడు ద్రవిడ్. టీ ట్వంటీ ఛాంపియన్స్ లీగ్ తరువాత టీ ట్వంటీలకు కూడా గుడ్ బై చెప్పనున్నాడని సమాచారం. రిటైర్మెంట్ మీద అడిగిన ప్రశ్నకు సమాధానంగా తనకు ఇప్పుడు 41 ఏళ్ళని, వచ్చే ఏడాది గురించి ఇప్పుడేమీ చెప్పలేనన్నాడు. గుంభనంగా ఉండే మిస్టర్ డిపెండబుల్ మనసులో ఏముందో ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత తెలియనుంది.

  • Loading...

More Telugu News