TTD: కచ్చితమైన జీఎస్టీ చెల్లింపులకు గాను కేంద్రం నుంచి టీటీడీకి ప్రశంసాపత్రం

Union Govt appreciates TTD for GST returns and tax payments

  • దేశంలో జీఎస్టీ ప్రవేశపెట్టి నాలుగేళ్లు
  • కచ్చితంగా చెల్లింపులు చేసే సంస్థలకు సన్మానం
  • క్రమం తప్పకుండా చెల్లిస్తున్న టీటీడీ
  • 11 రాష్ట్రాల్లో టీటీడీకి జీఎస్టీ రిజిస్ట్రేషన్

దేశంలో జీఎస్టీని ప్రవేశపెట్టి నాలుగేళ్లయిన సందర్భంగా జీఎస్టీని కచ్చితంగా చెల్లిస్తున్న వారిని సన్మానించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ జాబితాలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కూడా ఉంది. ఈ క్రమంలో టీటీడీకి కేంద్రం నుంచి ప్రశంసాపత్రం లభించింది. సకాలంలో జీఎస్టీ చెల్లింపులకు గాను కేంద్రం ఈ మేరకు అభినందించింది. 2021 మార్చి 31 వరకు జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేయడంలోనూ, పన్ను చెల్లింపులకు గాను టీటీడీకి ఈ ప్రశంసాపత్రం ఇచ్చారు.

దేశంలోని 11 రాష్ట్రాల్లో లావాదేవీల నిమిత్తం టీటీడీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంది. అందులో, రెండు రాష్ట్రాల్లో టీటీడీ జరిపిన లావాదేవీల జీఎస్టీ చెల్లింపులకు గాను కేంద్రం నుంచి ఈ ప్రశంసాపత్రం అందింది. దేశంలో 1.3 కోట్ల సంస్థలు జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోగా, అందులో 54,439 సంస్థలు జీఎస్టీని కచ్చితంగా చెల్లిస్తున్నాయి.

  • Loading...

More Telugu News