Devineni Uma: దేవినేని ఉమ బెయిల్ పిటిషన్ విచారణను సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు

AP High Court adjourns Devineni Uma bail petition hearing to Monday

  • బెయిల్ పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో కొనసాగిన వాదనలు
  • అక్రమ కేసులు పెట్టారన్న ఉమ తరపు న్యాయవాది
  • ఉమ కస్టడీ కోసం జిల్లా కోర్టులో పిటిషన్ వేసిన పోలీసులు

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ బెయిల్ పిటిషన్ పై ఈరోజు ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఉమపై జి.కొండూరు పోలీసు స్టేషన్ లో అక్రమ కేసులు నమోదయ్యాయని ఉమ తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. ఇరు పక్షాల వాదనలను విన్న తర్వాత తదుపరి విచారణను సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది.

మరోవైపు దేవినేని ఉమను తమ కస్టడీకి ఇవ్వాలని జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఉమ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయనపై హత్యాయత్నం, కుట్రతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News