Dinesh Tej: విష్వక్సేన్ చేతుల మీదుగా 'మెరిసే మెరిసే' ట్రైలర్ రిలీజ్!

Merise Merise trailer launched by Vishwak Sen
  • ఎమోషన్స్ తో కూడిన లవ్ స్టోరీ
  • దినేశ్ జోడీగా శ్వేత అవస్తి
  • ఆసక్తిని పెంచుతున్న ట్రైలర్
  • వచ్చేనెల 6వ తేదీన విడుదల  
తెలుగు తెరకి మరో ప్రేమకథ పరిచయం కానుంది .. ఆ సినిమా పేరే 'మెరిసే మెరిసే'. ప్రేమ .. దాని చుట్టూ అల్లుకున్న ఎమోషన్స్ తో కూడిన కథ ఇది. వెంకటేశ్ కొత్తూరి నిర్మించిన ఈ సినిమాకి, పవన్ కుమార్ దర్శకుడిగా వ్యవహరించాడు. నాయకా నాయికలుగా దినేశ్ తేజ్ - శ్వేత అవస్తి నటించిన ఈ సినిమాను వచ్చేనెల 6వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను హీరో విష్వక్సేన్ తో రిలీజ్ చేయించారు. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందనీ, సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకం తనకి ఉందని విష్వక్సేన్ అన్నాడు. దినేశ్ తేజ్ మంచి నటుడనీ, ఆయన కెరియర్ కి ఈ సినిమా హెల్ప్ అవుతుందనే నమ్మకం ఉందని చెప్పాడు.

శ్రీమంతుడి కొడుకైన హీరో ఓ పార్టీలో ఓ అమ్మాయిని చూసి మనసు పారేసుకుంటాడు. అయితే అప్పటికే ఆమెకి వేరొకరితో ఎంగేజ్ మెంట్ జరిగిపోతుంది. అయినా ప్రేమంటూ ఆమె వెంటపడి అనుకున్నది సాధిస్తాడు. ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేదే కథ. ఈ సినిమా ఎలాంటి రిజల్టును  రాబడుతుందో చూడాలి మరి.
Dinesh Tej
Swetha Avasthi
Merise Merise Movie

More Telugu News