Balakrishna: 'అఘోర'గా కనిపించనున్న జగపతిబాబు?
![Jagapathi Babu in Akhanda movie](https://imgd.ap7am.com/thumbnail/cr-20210728tn61015fa5e0c1b.jpg)
- క్లైమాక్స్ దశలో 'అఖండ'
- తమిళనాడులో చిత్రీకరణ
- విలన్ గా శ్రీకాంత్
- దసరాకి ముందుగా రిలీజ్
జగపతిబాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన చేతిలో అరడజనుకుపైగా సినిమాలు ఉన్నాయి. ఆయన 'అఖండ' సినిమాలో 'అఘోర'గా కనిపించనున్నాడనే టాక్ జోరుగా షికారు చేస్తోంది. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య కథానాయకుడిగా 'అఖండ' సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు తమిళనాడులో జరుగుతోంది.
బాలయ్య తదితరులపై అక్కడ క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకోనుంది. ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నాడు. ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు కొత్తగా ఉంటుందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే జగపతిబాబు కూడా ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించనున్నాడనీ, అఘోర ఎపిసోడ్ లో ఆయన కనిపిస్తాడని అంటున్నారు. అఘోర పాత్రలో ఉన్న బాలయ్యకి ఆయన మార్గదర్శిగా కనిపిస్తాడని చెబుతున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి. దసరాకి ముందు ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.