BJP: ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై మండిప‌డుతూ బీజేపీ నేత‌ల ధ‌ర్నా.. ఉద్రిక్త‌త‌

bjp agitation agaist tippu sultan statue

  • అనుమతి లేకుండా టిప్పు సుల్తాన్ విగ్ర‌హం పెట్టారు
  • విగ్రహాన్ని పెట్టిన ఎమ్మెల్యేని అరెస్టు చేసే దమ్ములేదు
  • శాంతియుతంగా నిరసన చేస్తున్న మమ్మల్ని అడ్డుకోవడం సిగ్గుచేటు
  • విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి ఆగ్ర‌హం

కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయ‌డాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ఆందోళ‌న‌కు దిగారు. ఈ రోజు ఉద‌యం పురపాలక సంస్థ కార్యాలయం వ‌ద్ద‌కు చేరుకున్న బీజేపీ నేత‌లు అక్క‌డే బైఠాయించి ఆందోళ‌న చేశారు.

అక్క‌డి నుంచి వెళ్లిపోవాల‌ని పోలీసులు చెప్పిన‌ప్ప‌టికీ బీజేపీ నేత‌లు విన‌క‌పోవ‌డంతో వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి మాట్లాడుతూ... జిన్నా రోడ్డులో టిప్పు సుల్తాన్‌ విగ్రహ ఏర్పాటు చేసిన‌ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిని అరెస్టు చేయ‌కుండా, శాంతియుతంగా ధర్నాకు దిగిన త‌మ‌ను ఎందుకు  అరెస్టు చేస్తున్నార‌ని పోలీసుల‌ను నిల‌దీశారు.

ఎమ్మెల్యేల‌ను అరెస్టు చేసే ద‌మ్ములేని వైసీపీ ప్ర‌భుత్వానికి, శాంతియుతంగా నిరసన చేస్తున్న తమను అడ్డుకోవడం సిగ్గుచేటని విమ‌ర్శించారు. ప్రొద్దుటూరులో బీజేపీ నేత‌ల ధ‌ర్నా నేప‌థ్యంలో కాసేపు ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News