Telangana: తెలంగాణ మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ ఫైర్

BJP Fires on TRS Ministers on Ramappa Issue

  • చారిత్రక రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు
  • మోదీ, కిషన్ రెడ్డి కృషి వల్లే వచ్చిందన్న బీజేపీ
  • తెలంగాణకు కిషన్ రెడ్డి ఇచ్చిన తొలి బహుమతన్న బండి సంజయ్

ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపుపై తెలంగాణ మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ మండిపడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే ఈ గుర్తింపు లభించిందంటూ మంత్రులు ప్రచారం చేయడం సిగ్గుచేటని మండిపడింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కృషి వల్లే కట్టడానికి ఆ ఖ్యాతి దక్కిందని పేర్కొంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా కిషన్ ‌రెడ్డి తెలంగాణకు ఇచ్చిన తొలి బహుమతి ఇదేనని అన్నారు. రామప్పకు యునెస్కో గుర్తింపుపై కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Telangana
Ramappa Temple
BJP
Bandi Sanjay
Revanth Reddy
  • Loading...

More Telugu News