: నీళ్లిచ్చి క్రెడిట్ తీసుకోండి.. కాంగ్రెస్ కు మోడీ ఆఫర్


సర్ధార్ సరోవర్ ప్రాజెక్టు పూర్తిచేస్తే ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేందుకు సిద్దమని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. లక్షల ఎకరాలకు నీరందించే సర్ధార్ సరోవర్ ప్రాజెక్టుకు గేట్లు బిగించి, ప్రాజెక్టు ద్వారా పంటలకు నీరు సరఫరా చేసేందుకు అనుమతినివ్వాలని యూపీఏను కోరారు. ప్రజలకు మంచి జరిగితే అందుకు అందరం సంతోషిద్దామని, ప్రాజెక్టు విషయంలో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం రాజకీయాలు చేయవద్దని సూచించారు. తామేమీ గుర్తింపుకోసం ప్రాకులాడట్లేదని, చేతనైతే నీళ్లిచ్చి క్రెడిట్ తీసుకోవాలని కాంగ్రెస్ కు సవాలు విసిరారు.

  • Loading...

More Telugu News