Ram Gopal Varma: 8 రకాల భార్యలున్నారంటున్న ఆర్జీవీ..!

RGV Web Series On Wives

  • ‘రకరకాల భార్యలు’ పేరిట వెబ్ సిరీస్
  • ‘30 వెడ్స్ 21’ ఫేమ్ చైతన్య కీలకపాత్ర
  • రకరకాల భర్తలంటూ సెకండ్ సీజన్

ఎన్నో శతబ్దాల క్రితమే భరత మహాముని, కేశవుడు వంటి ఎందరో మహానుభావులు మహిళల గురించి ఎంతో చెప్పారని, కానీ, ఆ మహిళల అసలు రంగు పెళ్లయి భార్యగా మారిన తర్వాతే తెలుస్తుందని రామ్ గోపాల్ వర్మ అంటున్నారు. అవును మరి, ఆయనిప్పుడు భార్యల మీద పడిపోయారు లెండి. ‘రకరకాల భార్యలు’ అంటూ వెబ్ సిరీస్ ను జనం ముందుకు తీసుకొచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. 8 రకాల భార్యలున్నారంటున్నారు.

ఏడుపుగొట్టు, దెబ్బలాడే రకం, ఫోన్ పట్టుకుంటే వదలని భార్య, అనుమానుపు పిశాచి, ముక్కు మీద కోపం, భర్తను తొక్కి ఉంచే భార్య, పిసినిగొట్టు, గొప్పలు చెప్పుకునే భార్య అని చెప్పుకొచ్చారు. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో రకం భార్య గురించి చెప్తామని, మగవాడికి ఎలాంటి రకం భార్య దొరికితే జీవితం ఎలా మారుతుందో చెప్పడమే ఈ సిరీస్ ఉద్దేశమన్నారు. ఇదంతా సీజన్ వన్ అని, సీజన్ 2లో ‘రకరకాల భర్తల’ గురించి చెప్తామన్నారు.

‘30 వెడ్స్ 21’ ఫేమ్ చైతన్య కీలకపాత్ర పోషించనున్నాడు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలు కానుంది. దానికి సంబంధించిన ప్రమోషనల్ (మాటల) వీడియోను యూట్యూబ్ లో వదిలారు. ఆనాడు మహానుభావులు చెప్పింది కొంతేనని, కానీ, కాలం మారే కొద్దీ మరెన్నో రకాల భార్యలు పుట్టుకొస్తారని అన్నారు. భార్యలు ఏ రకమో.. వారిని పెళ్లి చేసుకున్న భర్తలకే తెలుస్తుందని, అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే వెబ్ సిరీస్ ను తీస్తున్నానని ప్రకటించారు.

Ram Gopal Varma
RakaRakala Bharyalu
Wives
Web Series
  • Loading...

More Telugu News