: సమాధాన పత్రంతో ఉడాయించిన విద్యార్థిని
ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షకు హాజరైన మొదటి సంవత్సరం విద్యార్థిని సమాధాన పత్రం ఇన్విజిలేటర్ కు ఇవ్వకుండా తనతో పాటు తీసుకెళ్లిన ఘటన ఇచ్చాపురం జ్ఞానభారతి కళాశాలలో చోటుచేసుకుంది. ఒడిషాకు చెందిన కాయ తేజ ఈరోజు గణిత పరీక్షకు హాజరై తనతో పాటూ సమాధాన పత్రాన్ని తీసుకుని వెళ్లిపోయింది. సమాధాన పత్రాలు లెక్కించిన సిబ్బంది తేజ సమాధాన పత్రం ఇవ్వని విషయం గుర్తించారు. దీంతో ఆమె ఇంటికి వెళ్లి సమాధాన పత్రం తీసుకొచ్చి విద్యార్థినిని, ఇన్విజిలేటర్ అనురాధను అరెస్టు చేశారు.