Water Dogs: నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద నీటి కుక్కల సందడి... వీడియో ఇదిగో!
- తెలంగాణ, ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు
- సాగర్ కు భారీగా వరద నీరు
- డ్యామ్ లో పెరిగిన నీటిమట్టం
- బయటికి వస్తున్న నీటి కుక్కలు
తెలంగాణలోనూ, ఎగువ రాష్ట్రాల్లోనూ కురుస్తున్న భారీ వర్షాలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. ఈ క్రమంలో ఎంతో అరుదైన నీటి కుక్కలు డ్యామ్ వద్ద దర్శనమిస్తున్నాయి. డ్యామ్ వద్ద వాటర్ స్కేల్ పాయింట్ వద్ద వీటిని గుర్తించారు. సాగర్ డ్యామ్ నీటిమట్టం పెరగడంతో ఇవి బయటికి వచ్చినట్టు భావిస్తున్నారు. వీటి ప్రధాన ఆహారం చేపలు. గతంలోనూ ఇవి ఈ ప్రాంతంలో కనిపించాయి.
ఇవి నీటిలోనూ, భూమిపైన సంచరించగల ఉభయచరాలు. నీటికుక్కలకు చెందిన 13 జాతులు, 7 ప్రజాతులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. అయితే, అంతరించిపోతున్న జంతు జాతుల్లో నీటి కుక్కలు కూడా ఉన్నాయి. కొంతకాలంగా వీటి సంఖ్య వేగంగా తగ్గిపోతోంది.