: ఫిక్సింగ్ ను నూతన న్యాయవిధానంతో అరికడతాం: కపిల్ సిబాల్
స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై తొలిసారి కేంద్రమంత్రి నోరు విప్పారు. ఐపీఎల్ 6 నే కాకుండా దేశం యావత్తునూ కుదిపేస్తున్న స్పాట్ ఫిక్సింగ్ వంటి కుంభకోణాలను అరికట్టేందుకు నూతన న్యాయవిధానాన్ని తీసుకొస్తున్నామని కేంద్ర న్యాయశాఖా మంత్రి కపిల్ సిబాల్ తెలిపారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ లాంటి కుంభకోణాలకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకునేందుకు ప్రస్తుత న్యాయవిధానం తగినంత సిద్దంగా లేదన్న మంత్రి, దోషులను కఠినంగా శిక్షించేందుకు నూతన న్యాయసూత్రలను సిద్దం చేస్తున్నట్టు తెలిపారు. నాలుగైదు రోజుల్లో లాంఛనాలు పూర్తి చేసి క్రీడా మంత్రిత్వ శాఖతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.