Sri Lanka: టీమిండియా టాపార్డర్ ను కట్టడి చేసిన లంక బౌలర్లు
- కొలంబోలో టీమిండియా, శ్రీలంక మ్యాచ్
- టీమిండియా టార్గెట్ 276 రన్స్
- 32 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసిన భారత్
- రాణించిన లంక బౌలర్లు
కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత టాపార్డర్ తడబాటుకు గురైంది. 276 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం భారత్ స్కోరు 32 ఓవర్లలో 6 వికెట్లకు 185 పరుగులు. కృనాల్ పాండ్య 34, దీపక్ చాహర్ 2 పరుగులతో ఆడుతున్నారు. అంతకుముందు, ఇన్నింగ్స్ ఆరంభంలో పృథ్వీ షా 13, కెప్టెన్ శిఖర్ ధావన్ 29 పరుగులు చేసి హసరంగ బౌలింగ్ లో అవుటయ్యారు. చిచ్చరపిడుగు ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ లో తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం 1 పరుగు చేసి కసున్ రజిత బౌలింగ్ లో వెనుదిరిగాడు.
ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ (53), మనీష్ పాండే (37) రాణించారు. మనీష్ పాండే రనౌట్ కాగా, ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా (0) డకౌట్ కావడంతో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. సూర్యకుమార్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత సందాకన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.