Diabetes: మధుమేహ రోగులకు గుడ్‌న్యూస్.. ఇక లాలాజలంతోనే డయాబెటిస్ పరీక్ష!

Scientists developed Saliva test for Diabetic patients

  • నూతన విధానాన్ని అభివృద్ధి చేసిన ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు
  • ‘హోలి గ్రెయిల్’గా నామకరణం
  • ఇక ప్రతిసారీ రక్త నమూనాలు ఇచ్చే బాధ తప్పినట్టే

డయాబెటిస్ పరీక్ష మరింత సులభతరం కానుంది. రక్తంలో చక్కెర స్థాయిని పరీక్షించే విధానానికి బదులుగా లాలాజలంతోనే ఆ పరీక్ష చేయనున్నారు. ఆస్ట్రేలియాలోని న్యూ క్యాజిల్ యూనివర్సిటీ  శాస్త్రవేత్తలు ఈ సరికొత్త పద్ధతిని కనుగొన్నారు. ఈ నయా పద్ధతిని ‘హోలి గ్రెయిల్’గా పిలుస్తున్నారు. ఈ విధానం వల్ల మధుమేహ పరీక్ష చేయించుకున్న ప్రతిసారీ రక్తం ఇచ్చే బాధ తప్పుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

గ్లూకోజ్‌ను గుర్తించే ఎంజైమును ట్రాన్సిస్టర్‌లో పొందుపర్చడం ద్వారా లాలాజలంలో గ్లూకోజ్ స్థాయిని గుర్తించవచ్చని తెలిపారు. ఇదే విధానం ద్వారా కొవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు హార్వర్డ్ యూనివర్సిటీతో కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News