Niti Aayog: రాబోయే 100-125 రోజులు అత్యంత కీలకం: నీతి ఆయోగ్

Next 100 to 125 cases are very important says NITI Aayog

  • కరోనా కేసుల తగ్గుదల రేటు తగ్గింది
  • ఇది మనందరికి హెచ్చరిక వంటిది
  • ఈ నెలాఖరుకి 50 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేయాలనేదే లక్ష్యం

కరోనాపై పోరాటంలో రాబోయే 100 నుంచి 125 రోజులు అత్యంత కీలకమని నీతి ఆయోగ్ తెలిపింది. సెకండ్ వేవ్ లో ఉద్ధృతంగా నమోదైన కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టినప్పటికీ... కేసుల తగ్గుదల శాతం గత కొన్ని రోజులుగా తగ్గిందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. ఇది మనకు ఒక హెచ్చరిక వంటిదని ఆయన అన్నారు. రాబోయే 100-125 రోజులు అత్యంత కీలకమని చెప్పారు.

జులై చివరి నాటికి 50 కోట్ల వ్యాక్సిన్ డోసులను వేయాలనే టార్గెట్ ను పెట్టుకున్నామని వీకే పాల్ తెలిపారు. 66 కోట్ల డోసులకు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిందని... దీనికి అదనంగా ప్రైవేట్ సెక్టార్ కు కూడా 22 కోట్ల డోసులు వెళతాయని చెప్పారు. మూడో వేవ్ ను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని టాస్క్ ఫోర్స్ ను ప్రధాని మోదీ ఆదేశించారని తెలిపారు.

  • Loading...

More Telugu News