Jurala project: ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు.. జూరాలకు పోటెత్తుతున్న వరద

flood water coming to jurala project from Upper areas

  • ఒక్క రోజులోనే 18 వేల నుంచి 63 వేల క్యూసెక్కులకు పెరిగిన జూరాల నీటి మట్టం
  • ప్రకాశం బ్యారేజీ నుంచి 8,238 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల
  • ధవళేశ్వరం నుంచి 12 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి

తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో జూరాలకు వరద పోటెత్తుతోంది. వర్షాలతో కృష్ణా, గోదావరి నదుల్లో ప్రవాహం పెరుగుతుండడంతో ఎగువ ప్రాంతాల్లోని ప్రాజెక్టుల నుంచి జూరాలకు వరద ప్రవాహం పెరుగుతోంది. జూరాల జలాశయంలో గురువారం రాత్రి 18 వేల క్యూసెక్కుల నీరు ఉండగా ఒక్క రోజులోనే అది ఏకంగా 63 వేలకు పెరగడం గమనార్హం. దీంతో అక్కడి నుంచి శ్రీశైలానికి 35వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరద ప్రవాహంలో 8,238 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరిలో శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు నిన్న ఉదయం వరకు 1.17 లక్షల క్యూసెక్కులు రాగా, సాయంత్రానికి అది 9,876 క్యూసెక్కులకు తగ్గింది. కడెం ప్రాజెక్టు నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి 32 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. కాళేశ్వరంలోని లక్ష్మి (మేడిగడ్డ) బ్యారేజీ నుంచి 41 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక గోదావరిలో ధవళేశ్వరం నుంచి 1.12 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

  • Loading...

More Telugu News