Rains: తెలంగాణలో కురుస్తున్న వర్షాలు.. 21న అల్పపీడనం

Heavy rains in telangana low pressure in bay of bengal on 21st

  • నేడు, రేపు అక్కడకక్కడ భారీ వర్షాలకు అవకాశం
  • నిన్న అత్యధికంగా మాగనూర్‌లో 4.8 సెంటీమీటర్ల వర్షపాతం
  • నాలుగు రోజుల తర్వాత మళ్లీ పెరగనున్న వానలు

రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో తెలంగాణలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. నిన్న కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. నారాయణపేట జిల్లా మాగనూర్‌లో అత్యధికంగా 4.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నేడు, రేపు కూడా రాష్ట్రంలో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈ నెల 21న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, మహారాష్ట్రపై గాలులతో 2.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండగా తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలుల ద్రోణి ఉన్నట్టు అధికారులు వివరించారు. మరో నాలుగు రోజుల తర్వాత తెలంగాణలో వానలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News