Balakrishna: 'వినాయక చవితి'కి రానున్న 'అఖండ'!

Akhanda movie update

  • చివరిదశ చిత్రీకరణలో 'అఖండ'
  • త్వరలో షూటింగు పార్టు పూర్తి
  • దసరా ఆశలు లేనట్టే  
  • ముందుగానే రంగంలోకి

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో 'అఖండ' రూపొందుతోంది. చిత్రీకరణపరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఈ నెలాఖారు నాటికి చిత్రీకరణ పూర్తవుతుందని అంటున్నారు. దాంతో ఈ సినిమా దసరాకి వస్తుందని అంతా అనుకున్నారు. బాలకృష్ణకి దసరా సెంటిమెంట్ ఎక్కువ. గతంలో దసరాకి వచ్చిన ఆయన సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. అందువలన ఈ సినిమాను కూడా దసరా కానుకగా అభిమానులకు అందించాలని ఆయన అనుకున్నారు. కానీ ఇప్పుడు మేకర్స్ తమ ఆలోచన మార్చుకున్నట్టుగా తెలుస్తోంది.

'ఆర్ ఆర్ ఆర్' సినిమా దసరాకి రాకపోవచ్చనే ఉద్దేశంతో 'ఆచార్య' .. 'రాధేశ్యామ్' .. 'అఖండ' ఆ దిశగా అడుగులు వేశాయి. కానీ నిన్న 'ఆర్ ఆర్ ఆర్' నుంచి మేకింగ్ వీడియోను వదిలారు. ఈ వీడియో చివర్లో రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ముందుగా చెప్పినట్టుగానే దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నామని స్పష్టత ఇచ్చేశారు. దాంతో ఇప్పుడు మిగతా సినిమాలు తమ విడుదల సమయాలను పరిశీలించుకునే పనిలో పడ్డాయి. అలా 'అఖండ' సినిమాను వినాయక చవితికి ప్లాన్ చేస్తున్నారనే ఒక టాక్ మాత్రం బలంగానే వినిపిస్తోంది.  

Balakrishna
Pragya Jaswal
Poorna
  • Loading...

More Telugu News