Maharashtra: మహారాష్ట్రలోని 8 జిల్లాల్లో అత్యధికంగా నమోదవుతున్న కరోనా కేసులు
- పూణే రూరల్, కొల్హాపురి, సతారా, సంధూదుర్గ్, రాయ్ గఢ్, పాల్ఘాట్, రత్నగిరి, సాంగ్లీ జిల్లాల్లో అత్యధిక కేసులు
- ఈ జిల్లాల్లో మరణాల సంఖ్య కూడా అధికమే
- ఈ జిల్లాలపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ... మహారాష్ట్రలో మాత్రం కేసుల సంఖ్య భారీగానే నమోదవుతోంది. ముఖ్యంగా 8 జిల్లాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పూణే రూరల్, కొల్హాపురి, సతారా, సంధూదుర్గ్, రాయ్ గఢ్, పాల్ఘాట్, రత్నగిరి, సాంగ్లీ జిల్లాల్లో కొత్త కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్నాయి.
ఇదే సమయంలో ఈ జిల్లాల్లో కరోనా మృతుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. మహారాష్ట్రలో నిన్న మొత్తం 8,535 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 158 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటిలో అత్యధిక కేసులు ఈ 8 జిల్లాల్లోనే నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. కోవిడ్ టెస్టుల సంఖ్యను పెంచడంతో పాటు, జిల్లాల్లో హాట్ స్పాట్ లను గుర్తించి రోగులను ఐసొలేషన్ లో ఉంచుతున్నారు.