Raviteja: రవితేజ నుంచి 'రామారావు ఆన్ డ్యూటీ' ఫస్టులుక్
![Ravi Teja First Look from RamaRao On Duty movie](https://imgd.ap7am.com/thumbnail/cr-20210712tn60ebd3c2a9ed9.jpg)
- 'క్రాక్'తో లభించిన భారీ సక్సెస్
- విడుదలకి రెడీ అవుతున్న 'ఖిలాడి'
- టైటిల్ ఖరారు చేసుకున్న నెక్స్ట్ మూవీ
- దర్శకుడిగా శరత్ మండవ పరిచయం
కరోనా కారణంగా ఒక వైపున పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ, రవితేజ తన దూకుడును మాత్రం తగ్గించలేదు. మొదటి లాక్ డౌన్ తరువాత థియేటర్లకు వచ్చిన 'క్రాక్' సంచలన విజయాన్ని నమోదు చేసింది. రవితేజ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా అది నిలిచింది. ఆ సినిమాను గురించి ఇంకా అంతా మాట్లాడుకుంటూ ఉండగానే, రవితేజ 'ఖిలాడి' సినిమాను కూడా విడుదల వైపుకు నడిపిస్తున్నాడు.
![](https://img.ap7am.com/froala-uploads/20210712fr60ebd3b80fd06.jpg)