rain: బంగాళాఖాతంలో అల్పపీడనం.. హైద‌రాబాద్ స‌హా ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు

rains in ts

  • రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
  • హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్, ఖ‌మ్మంలో కురుస్తోన్న‌ భారీ వాన
  • ప‌లు ప్రాంతాల్లో రోడ్లు జ‌ల‌మ‌యం

పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే, తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య గాలులతో ద్రోణి ఏర్పడిందన్నారు. తీరం వెంబడి గంటకు 55-65 కీమీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు రెండు రోజుల వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్ల‌కూడ‌ద‌ని చెప్పారు.

అల్ప పీడ‌న ప్రభావంతో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంద‌న్నారు. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వివ‌రించారు. కాగా, హైదరాబాద్ స‌హా తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. హైద‌రాబాద్‌లోని కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్‌, ఆల్విన్‌ కాలనీ, నిజాంపేట్‌తో పాటు ప్రగతినగర్‌, బాచుపల్లి, బాలానగర్‌, కుత్బుల్లాపూర్‌, మాదాపూర్‌, కొండాపూర్‌, మణికొండ, బంజారాహిల్స్‌, జూబ్లిహిల్స్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, లంగర్‌హౌస్‌, ఇత‌ర ప్రాంతాల్లో వ‌ర్షం కురుస్తోంది.

మ‌రోవైపు, వరంగల్‌, హన్మకొండ, కాజీపేటలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తుండ‌డంతో ప‌లు ప్రాంతాల్లో రోడ్లు జలమయ్యాయి. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో వ‌ర్షాలు కురుస్తున్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో అత్యధికంగా 14.9 సెంటీమీటర్లు, కుమ్మెరలో 14.6 సెం.మీ వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

  • Loading...

More Telugu News