alla ramakrishnareddy: రాంకీ గ్రూప్‌లో నాకు షేర్లు లేవు: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

alla slams tdp

  • రాంకీ సంస్థల్లో ఇటీవ‌ల ఆదాయపన్ను శాఖ  తనిఖీలు
  • స్పందించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి
  • 2006లో తాను రాంకీ సంస్థలో ఉద్యోగం చేశా
  • ఆ సంస్థ షేర్లు, మూలధనం వివ‌రాల‌ను టీడీపీ నేతలు తెలుసుకోవాలి

రాంకీ సంస్థల్లో ఇటీవ‌ల ఆదాయపన్ను శాఖ తనిఖీలు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. కృత్రిమ నష్టాలు చూపి ఆ సంస్థ‌ పన్నులు ఎగ్గొట్టినట్టు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీనిపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తోన్న నేప‌థ్యంలో  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. 2006లో తాను రాంకీ సంస్థలో ఉద్యోగం చేశానని ఆయ‌న చెప్పారు. 2006 నుంచి 2021 వరకు రాంకీ గ్రూప్‌లో తనకు ఏ విధమైన షేర్లు లేవని అన్నారు.

ఆ సంస్థ షేర్లు, మూలధనం వివ‌రాల‌ను టీడీపీ నేతలు తెలుసుకోవాలని ఆయ‌న అన్నారు. అలాగే, దుగ్గిరాలలో ఎక్కడ అవినీతి జరిగిందో నిరూపించాలని వ్యాఖ్యానించారు. తన రాజకీయ చరిత్రలో ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదని చెప్పుకొచ్చారు. గ‌తంలో పుష్కరాల పేరుతో తాడేపల్లిలో టీడీపీ స‌ర్కారు రెండువేల ఇళ్లను తొలగించిందని అన్నారు.

alla ramakrishnareddy
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News