Ram: మాస్ మెచ్చేలా రామ్ న్యూ మూవీ టైటిల్!

Mass title for ram movie

  • నిరాశపరిచిన 'రెడ్'
  • లింగుసామితో కొత్త ప్రాజెక్ట్
  • పరిశీలనలో 'ఉస్తాద్' టైటిల్
  • త్వరలోనే రానున్న ప్రకటన

టాలీవుడ్ లో రామ్ కి కెరియర్ ఆరంభం నుంచి చాక్లెట్ బాయ్ అనే పేరు ఉంది. వరుసగా ఆయన ప్రేమకథలను చేసుకుంటూ వచ్చాడు. దాంతో యూత్ లో ... ముఖ్యంగా అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. అలాంటి రామ్ ఆ తరువాత మాస్ ఇమేజ్ ను కోరుకున్నాడు. ఆ దిశగా అడుగులు వేస్తూ వెళ్లిన ఆయనకి 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ఆ ముచ్చట తీర్చింది. ఆ తరువాత రామ్ మళ్లీ కామెడీ టచ్ ఉన్న రొమాంటిక్ సినిమాలు చేసుకుంటూ వెళతాడని అనుకున్నారు.కానీ ఆ తరువాత కూడా రామ్ తన కథల్లో మాస్ అంశాలు ఉండేలా చూసుకుంటున్నాడు. 'రెడ్' కూడా కొంతవరకూ ఆ తరహాలో నడిచిన కథనే. ఇక ఇప్పుడు ఆయన లింగుసామి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా మాస్ ఆడియన్స్ కోరుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయట. ఇందులో రామ్ ను సరదాగా అంతా 'ఉస్తాద్' అనే పిలుస్తుంటారు. అందుకే, అదే టైటిల్ ను ఖరారు చేయాలనే ఆలోచనలో ఉన్నారనే ఒక టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఆయన సరసన కృతి శెట్టి అలరించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.

Ram
Kruthi Shetty
Lingussamy
  • Loading...

More Telugu News