Harish Rao: వైయస్సార్ వారసులమంటూ వస్తున్నారు.. జాగ్రత్తగా ఉండాలి: హరీశ్ రావు

Be careful with YSR Descendants says Harish Rao

  • తెలంగాణను అసెంబ్లీ సాక్షిగా వైయస్ అవమానించారు
  • ఆంధ్ర తొత్తులకు తెలంగాణలో స్థానం లేదు
  • కేసీఆర్ పై విశ్వాసంతో ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారు

తెలంగాణను మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీ సాక్షిగా అవమానించారని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ గురించి మాట్లాడితే గొంతునొక్కి, అసెంబ్లీ నుంచి బయటకు పంపించారని మండిపడ్డారు. ఇప్పుడు ఆయన వారసులమంటూ కొందరు వస్తున్నారని... వారిపట్ల తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు.

ఆంధ్ర తొత్తులకు, అవకాశవాదులకు తెలంగాణలో స్థానం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విశ్వాసంతోనే ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారని అన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో హరీశ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
 
కాంగ్రెస్, టీడీపీలు చేయలేని పనులను ఏడేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని హరీశ్ అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజి మంజూరు చేశామని చెప్పారు. ప్రతి గ్రామంలో ట్రాక్టర్, ట్యాంకర్ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. సంగారెడ్డికి కూడా గోదావరి నీళ్లను తీసుకొస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News