Jagananna Vidya Kits: జగనన్న కిట్ల పంపిణీలో అక్రమాలు అంటూ ఆరోపణలు.. విచారణకు ఆదేశించన ఏపీ ప్రభుత్వం
- పాఠశాల విద్య డైరెక్టర్ చినవీరభద్రుడిపై విచారణకు ఆదేశం
- అక్రమాలతో పాటు దళిత ఉద్యోగులపై వేధింపులకు పాల్పడున్నారని ఆరోపణలు
- సీఎంఓ, సీఎస్ లకు కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి ఫిర్యాదు
పాఠశాల విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం జగనన్న విద్యా కిట్ల పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. అయితే ఈ కిట్ల పంపిణీలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాఠశాల విద్య డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు విద్యాశాఖలో అవినీతి, దళిత ఉద్యోగులపై వేధింపులతో పాటు అక్రమాలకు పాల్పడుతున్న అధికారులకు అండగా ఉంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చినవీరభద్రుడిపై సీఎం కార్యాలయం, చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ లకు కర్నూలు జిల్లాకు చెందిన తేనె సాయిబాబా అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో, చినవీరభద్రుడిపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.