Vemula Prashanth Reddy: ఓటుకు నోటు కేసులో ఉన్న వ్యక్తి కేసీఆర్ నుంచి అధికారాన్ని తీసుకుంటానని అంటున్నారు: మంత్రి వేముల ఎద్దేవా
- లాక్కుంటే అధికారం రాదు.. ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది
- రేవంత్ రెడ్డి ఒక దొంగ
- బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు?
ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి అధికారాన్ని లాక్కుంటామన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో ఉన్న రేవంత్ రెడ్డి... కేసీఆర్ నుంచి అధికారాన్ని తీసుకుంటానని మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎవరో ఇస్తేనో, లేక లాక్కుంటేనో అధికారం రాదని... ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుందని అన్నారు. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రేవంత్ ఒక దొంగ అని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పై కూడా ఆయన మండిపడ్డారు. బండి సంజయ్ ఎందుకోసం పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. అర్హులందరికీ రూ. 2 వేల పెన్షన్ ఇస్తున్నందుకు పాదయాత్ర చేస్తున్నారా? అని ఎద్దేవా చేశారు. ఉచిత్ విద్యుత్తు, రైతుబంధు, కేసీఆర్ కిట్లు ఇస్తున్నందుకు చేస్తున్నారా? అని ప్రశ్నించారు.