Kapil Dev: రవిశాస్త్రి బాగా పని చేస్తున్నాడు.. అతన్ని తొలగించాలనుకోవడంలో అర్థం లేదు: కపిల్ దేవ్

No need to remove Ravi Sasthri says Kapil Dev

  • శ్రీలంక పర్యటకు వెళ్లిన భారత జట్టుకు కోచ్ గా ద్రావిడ్
  • కాబోయే హెడ్ కోచ్ ద్రావిడే అంటూ ప్రచారం
  • హెడ్ కోచ్ ను మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందన్న శాస్త్రి

టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రిని తొలగించి ఆయన స్థానంలో రాహుల్ ద్రావిడ్ ను నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. రవిశాస్త్రితో బీసీసీఐ ఒప్పందం ఐసీసీ ప్రపంచకప్ తో ముగుస్తుంది. ఆ తర్వాత కోచ్ పదవికి శాస్త్రి మళ్లీ దరఖాస్తు చేస్తాడో, లేదో కూడా తెలియదు. మరోవైపు శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు రాహుల్ ద్రావిడ్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ స్పందిస్తూ రవిశాస్త్రి అంశంపై ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు. రవిశాస్త్రి మెరుగైన ఫలితాలను రాబడుతున్నప్పుడు కోచ్ ను మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కొత్త కోచ్ ను తయారు చేసుకోవడంలో తప్పేమీ లేదని... అయితే శాస్త్రిని తొలగించాలనుకోవడంలో అర్థం లేదని అన్నారు.
 
ముందు శ్రీలంక పర్యటనను ముగియనివ్వాలని... అక్కడ మన జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందో తెలుస్తుందని చెప్పారు. టీమిండియాకు రిజర్వ్ బెంచ్ బలం ఎక్కువగా ఉందని అన్నారు. ఒకేసారి ఇంగ్లండ్, శ్రీలంకల్లో తమ రెండు జట్లు పర్యటిస్తున్నాయని... రెండు చోట్ల భారత్ గెలిస్తే అంతకన్నా కావాల్సింది ఏముందని వ్యాఖ్యానించారు. అయితే ఒకే సమయంలో ఇద్దరు ప్రత్యర్థులపై ఒత్తిడి ఎలా పెంచాలనే విషయాన్ని ఆయా జట్ల యాజమాన్యాలు చూసుకోవాలని అన్నారు.

  • Loading...

More Telugu News