Ram: సాంగ్ షూట్ కి రెడీ అవుతున్న రామ్!

Ram is ready to shoot the song

  • పట్టాలపైకి రామ్ ప్రాజెక్టు
  • సారథి స్టూడియోలో స్పెషల్ సెట్
  • కథానాయికగా కృతి శెట్టి
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్  

రామ్ తన తాజా చిత్రాన్ని తమిళ దర్శకుడు లింగుస్వామితో చేయనున్నాడు. కొంతకాలంగా ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతూ వస్తున్నాయి. ఈ సినిమా షూటింగు ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అనే ఆత్రుతలో ఉన్నట్టుగా ఇటీవల రామ్ ట్వీట్ చేశాడు కూడా. అయితే జ్ఞానవేల్ రాజా .. లింగుస్వామి మధ్య పాత లావాదేవీలు తెరపైకి వచ్చాయి. దాంతో ఈ సినిమా షూటింగు ఆగిపోవచ్చనే ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమా షూటింగు త్వరలో మొదలవుతుందని అంటున్నారు.

ఫస్టు షెడ్యూల్ ను హైదరాబాద్ లోనే ప్లాన్ చేశారు. సారథి స్టూడియోలో ఒక సాంగ్ షూటింగుతో ఈ షెడ్యూలు మొదలుకానుంది. సారథి స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ సాంగ్ ను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్లో రామ్ తో పాటు కథానాయికగా కృతి శెట్టి కూడా పాల్గొననుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పట్ల రామ్ చూపుతున్న ఉత్సాహం, అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.

  • Loading...

More Telugu News