Face Mask: బ్రిటన్‌లో మళ్లీ పాత రోజులు.. కొవిడ్ నిబంధనలు ఎత్తేసేందుకు సిద్ధం!

Face masks to become personal choice with UK
  • ‘స్వేచ్ఛాకాలం’ దిశగా బ్రిటన్
  • ఈ నెల 19 నుంచి నిబంధనలు ఎత్తివేసే యోచన
  • మాస్కులు ధరించడం ఇక ప్రజల ఇష్టం
నిన్నమొన్నటి వరకు కరోనాతో అల్లాడిపోయిన బ్రిటన్‌లో మళ్లీ పాత రోజులు రాబోతున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న కరోనా నిబంధనలను ఎత్తివేయాలని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం యోచిస్తోంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతుండడంతో ఈ నెల 19 నుంచి నిబంధనలను ఎత్తివేయాలని ప్రధాని సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆంక్షలు ఎత్తివేయాలని నిర్ణయించిన ప్రభుత్వం మాస్కులు ధరించడాన్ని మాత్రం ప్రజల ఇష్టానికే వదిలేయనుంది.

బ్రిటన్ గృహనిర్మాణ శాఖ మంత్రి కూడా నిన్న ఇదే విషయాన్ని వెల్లడించారు. నిబంధనలు ఎత్తివేసేందుకు, తిరిగి సాధారణ జీవనం సాగించేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయని మంత్రి తెలిపారు. వైరస్‌తో కలిసి జీవించే ఒక విభిన్న కాలానికి మనమంతా వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. కొవిడ్ ఆంక్షలు లేని కాలానికి మనమంతా వెళ్తున్నామని, అయితే ప్రజలేం చేయాలో ప్రభుత్వం చెప్పదని అన్నారు. కాగా, ఆంక్షల ఎత్తివేతకు సంబంధించి వచ్చే వారం ప్రధాని బోరిస్ ప్రకటిస్తారని అక్కడి మీడియా పేర్కొంది.
Face Mask
Britain
UK
Corona Virus
Boris Johnson

More Telugu News