Rashmika Mandanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Rashmika praises Allu Arjun

  • బన్నీని తెగ పొగుడుతున్న రష్మిక 
  • చిరంజీవి సినిమాలో బాలీవుడ్ నటుడు
  • కమల్ సినిమాలో నలుగురు విలన్లు  

*  'అల్లు అర్జున్ బ్రిలియంట్ డ్యాన్సర్' అంటూ కితాబునిచ్చించి కథానాయిక రష్మిక. తాజాగా సోషల్ మీడియాలో ఈ చిన్నది అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ గురించి అడిగిన ఓ అభిమానికి సమాధానం చెబుతూ, "తను పక్కా ప్రొఫెషనల్.. మంచి నటుడు.. సెట్స్ పై చాలా సరదాగా ఉంటాడు. అలాగే బ్రిలియంట్ డ్యాన్సర్ అన్న విషయం మనకు తెలిసిందే. అతనితో కలసి పనిచేయడాన్ని బాగా ఎంజాయ్ చేస్తాను'' అంటూ చెప్పుకొచ్చింది.    
*  ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికీ త్వరలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించనున్నాడు. బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే భారీ చిత్రంలో విలన్ పాత్రకు నవాజుద్దీన్ ని సంప్రదిస్తున్నట్టు, ఆ పాత్ర చేయడానికి ఆయన అంగీకరించినట్టూ తెలుస్తోంది.
*  కమలహాసన్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'విక్రమ్' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో ఏకంగా నలుగురు విలన్లు ఉంటారనీ, వారిలో ఒకరిగా మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ నటిస్తాడని సమాచారం. మిగతా ముగ్గురి ఎంపిక జరుగుతోంది.

Rashmika Mandanna
Allu Arjun
Chiranjeevi
Kamala Hassan
  • Loading...

More Telugu News