Venkatesh Daggubati: సెన్సార్ పూర్తి చేసుకున్న 'నారప్ప'

- 'నారప్ప'గా విభిన్నమైన పాత్రలో వెంకీ
- తమిళ 'అసురన్'కి రీమేక్
- ముఖ్యమైన పాత్రలో ప్రకాశ్ రాజ్
- థియేటర్లలోనే విడుదల అంటూ టాక్
వెంకటేశ్ కథానాయకుడిగా 'నారప్ప' సినిమా రూపొందింది. తమిళంలో ధనుశ్ హీరోగా చేసిన 'అసురన్' సినిమాకి ఇది రీమేక్. అక్కడ ఆ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ధనుశ్ కెరియర్లోనే వైవిధ్యభరితమైన చిత్రంగా నిలిచింది. భారీ వసూళ్లతోపాటు ప్రశంసలను కూడా తెచ్చిపెట్టింది. దాంతో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. సురేశ్ బాబు .. కలైపులి థాను ఈ సినిమాను నిర్మించారు.
