Zhurong: అంగారకుడిపై 'ఝురాంగ్' రోవర్ కదలికల వీడియోను పంచుకున్న చైనా

China releases Zhurong Rover video

  • అరుణగ్రహంపై చైనా పరిశోధనలు
  • గత మే నెలలో ఝురాంగ్ రోవర్ ల్యాండైన వైనం
  • ఝురాంగ్ కదలికలను భూమికి చేరవేసిన చైనా ఉపగ్రహం
  • ఇప్పటివరకు 236 మీటర్లు పయనించిన రోవర్

అంగారకుడిపై పరిశోధనల కోసం చైనా ఝురాంగ్ రోవర్ ను రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. మిషన్ మార్స్ లో భాగంగా చైనా ప్రయోగించిన ఝురాంగ్ రోవర్ గత మే నెలలో అరుణగ్రహం ఉపరితలంపై దిగింది. తాజాగా ఈ రోవర్ కదలికలతో కూడిన వీడియోను చైనా విడుదల చేసింది.

రోవర్ కు చెందిన ఓ వైర్ లెస్ కెమెరా ఈ కదలికలను చిత్రీకరించగా, అంగారకుడి చుట్టూ పరిభ్రమిస్తున్న తియాన్వెన్-1 శాటిలైట్ ఆ డేటాను గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ కు చేరవేసింది. కాగా, ఈ వీడియోలో ఝురాంగ్ రోవర్ ల్యాండింగ్ దృశ్యాలు కూడా ఉన్నాయి. జూన్ 27 నాటికి ఝురాంగ్ రోవర్ 236 మీటర్లు ప్రయాణించిందని చైనా నేషనల్ స్పేస్ ఏజెన్సీ (సీఎన్ఎస్ఏ) వెల్లడించింది.

  • Loading...

More Telugu News