Colombia: కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై కాల్పులు
- సార్డినటా నుంచి కుకుటా వెళ్తుండగా ఘటన
- హెలికాప్టర్‌లో అధ్యక్షుడితోపాటు కేంద్రమంత్రులు, గవర్నర్
- క్షేమంగా బయటపడ్డామన్న ఇవాన్ డ్యూక్
కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్‌తోపాటు ఇద్దరు కేంద్రమంత్రులు, ఉత్తర శాంటాడర్ గవర్నర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై శుక్రవారం కాల్పులు జరిగాయి. సార్డినటా నుంచి కుకుటా నగరానికి వెళ్తుండగా వెనుజువెలా సరిహద్దులో ఈ కాల్పులు జరిగాయి. ఈ ప్రాంతంలో సాయుధ ముఠాలు డ్రగ్స్ రవాణా, ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తుండడం గమనార్హం. కొలంబియాలోని తిరుగుబాటు సైన్యం, గెరిల్లా దళాలు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా, ఈ ఘటన నుంచి తాము క్షేమంగా బయటపడినట్టు ఇవాన్ నిన్న తెలిపారు.