MK Stalin: ఒలింపిక్స్ లో స్వర్ణం గెలిస్తే రూ.3 కోట్లు... తమిళనాడు సీఎం బంపర్ ఆఫర్

Tamilnadu CM MK Stalin announces huge prize to Olympic medalists

  • జపాన్ రాజధాని టోక్యో వేదికగా ఒలింపిక్స్
  • జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు క్రీడలు
  • ఒలింపిక్స్ లో పాల్గొంటున్న భారత అథ్లెట్లు
  • భారీ నజరానాలు ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం

వచ్చే నెలలో జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరగనున్న ఒలింపిక్స్ కీడ్రల్లో భారత బృందం కూడా పాల్గొంటోంది. జులై 23న ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్ ఆగస్టు 8న ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం గెలిచే భారత అథ్లెట్లకు ఒక్కొక్కరికి రూ.3 కోట్ల నజరానా ఇస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వెల్లడించారు. రజత పతక విజేతలకు రూ.2 కోట్లు, కాంస్య పతక విజేతలకు రూ.1 కోటి అందిస్తామని స్టాలిన్ తెలిపారు. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంతో భారత ఒలింపిక్ బృందంలో ఉత్సాహం నెలకొంది. సోషల్ మీడియా వేదికగా భారత అథ్లెట్లు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News