Prabhas: ప్రభాస్ వంటి స్టార్ ను చూడలేదు: 'ఆదిపురుష్' డైరెక్టర్!

Om Raut appreciated Prabhas

  • ప్రభాస్ స్టార్ డమ్ చూపించరు
  • ప్రతి ఒక్కరినీ ప్రేమగా పలకరిస్తారు
  • తన ఇంటి వంటను షేర్ చేసుకుంటారు
  • నిజంగా ఆయన చాలా సింపుల్

ప్రభాస్ పైకి ఎంత రఫ్ గా కనిపిస్తాడో .. లోపల అంత సున్నితంగా ఉంటాడని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఇక ఒకసారి ఆయనతో పరిచయమైతే వదులుకోవడం కష్టమని అంటూ ఉంటారు. ఆయనను దగ్గర నుంచి చూసినవారు ప్రభాస్ ఇంత సింపుల్ గా ఉంటాడా? అని ఆశ్చర్యపోతారు. పాన్ ఇండియా సినిమాగా 'ఆదిపురుష్'ను రూపొందిస్తున్న ఓమ్ రౌత్ కూడా అలాగే విస్మయానికి లోనయ్యాడట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు.

"ప్రభాస్ పెద్ద స్టార్ .. ప్రపంచవ్యాప్తంగా పెద్దసంఖ్యలో ఆయనకి అభిమానులు ఉన్నారు. యూత్ లో ఆయనకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటి ప్రభాస్ సెట్లో అందరితోనూ ఎంతో కలుపుగోలుగా ఉంటారు. అందరినీ సమానంగా చూస్తూ పలకరిస్తారు. ప్రేమతో కూడిన పలకరింపుతో ఆయన తన చుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేస్తారు. తన ఇంటివంటను సెట్లోని వారితో ఆయన షేర్ చేసుకుంటారు. మిగతా స్టార్స్ తో పోలిస్తే ప్రభాస్ చాలా సింపుల్. ఈ మధ్య కాలంలో ఇలాంటి స్టార్ ను చూడలేదు" అని చెప్పుకొచ్చారు.

Prabhas
Krithi Sanon
Om Raut
  • Loading...

More Telugu News