Parishat Elections: ఏపీలో పరిషత్ ఎన్నికలకు రీనోటిఫికేషన్ ఇవ్వాలన్న సింగిల్ బెంచ్ తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే

High court division bench stays single bench orders over Parishat Elections

  • ఇటీవల పరిషత్ ఎన్నికలపై సింగిల్ బెంచ్ తీర్పు
  • డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన ఎస్ఈసీ
  • రిట్ పిటిషన్ దాఖలు
  • నేడు విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్
  • విచారణ జులై 27కి వాయిదా

ఇటీవల ఏపీలో నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రద్దు చేసి, మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వడం తెలిసిందే. అయితే, దీనిపై ఎస్ఈసీ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఎస్ఈసీ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ నేడు విచారణ చేపట్టింది. రీనోటిఫికేషన్ ఇవ్వాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. తదుపరి విచారణను జులై 27కి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.

పరిషత్ ఎన్నికల వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాల్సి ఉందని ఈ సందర్భంగా డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. తుది తీర్పు వచ్చేవరకు ఓట్ల లెక్కింపు చేపట్టరాదని స్పష్టం చేసింది. కాగా, విచారణ సందర్భంగా.... అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకే తాము ఎన్నికలు జరిపామని ఎస్ఈసీ తరఫు న్యాయవాది డివిజన్ బెంచ్ కు నివేదించారు.

  • Loading...

More Telugu News