: ముంబై ఇండియన్సే ఐపీఎల్ 6 విజేతా ?


ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో గత రాత్రి అరెస్టయిన చెన్నై సూపర్ కింగ్స్ యజమాని, బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ ను ముంబై కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఫిక్సింగ్ కు పాల్పడ్డట్టు తమ ప్రాధమిక విచారణలో నిర్ధారణ అయిందని, మరో ఐదు రోజులు విచారణ నిమిత్తం తమకు అప్పగించాలని ముంబై పోలీసులు కోర్టును కోరారు.

గురునాధ్ అరెస్టుతో మరోపక్క బీసీసీఐ అధినేత శ్రీనివాసన్ తన పదవికి రాజీనామా చేయాలంటూ ఒత్తిడి పెరుగుతోంది. సహారా ఇండియా అధినేత, పూణే వారియర్స్ యజమాని సుబ్రతోరాయ్ మరో అడుగు ముందుకువేసి శ్రీనివాసన్ తన పదవి నుంచి వైదొలగక పోతే, భారత జట్టుకు తమ స్పాన్సర్ షిప్ ను ఉపసంహరించుకుంటామని హెచ్చరించారు. మరో వైపు ముంబై ఇండియన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ పోరు జరిగే అవకాశాలను దెబ్బతీసింది. ఇండియా సిమ్మెంట్స్ గురునాథ్ చెన్నై సూపర్ కింగ్స్ కు యజమాని కాదని, గౌరవ సభ్యుడని ప్రకటన విడుదల చేసింది.

దీనిపై కసరత్తు చేసిన ముంబై పోలీసులు గతంలో చెన్నై జట్టు పాల్గొన్న మ్యాచుల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సెర్మనీల్లో పాల్గొన్నప్పుడు చెన్నై జట్టు సీఈవో హోదాలో గురునాథ్ మెయ్యప్పన్ నిలబడడాన్ని సాక్ష్యంగా చూపించారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ భవితవ్యం అనుమానంలో పడింది. జట్టు ప్రిన్సిపల్ అరెస్టుతో బీసీసీఐ, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యత్వాన్ని రద్దు చేస్తే ముంబై ఇండియన్స్ జట్టు ఫైనల్ ఆడకుండానే విజేతగా నిలుస్తుంది.

  • Loading...

More Telugu News