Jagan: సీబీఐ, ఈడీ కోర్టులను సమయం కావాలని కోరిన జగన్
- జగన్ అక్రమాస్తుల కేసులో ఈరోజు విచారణ
- ఇందూ టెక్ జోన్ కేసులో డిశ్చార్జ్ పిటిషన్ వేసిన బీపీ ఆచార్య
- సమయం కోరిన జగన్, విజయసాయి, కార్మెల్ ఏషియా కంపెనీ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ఈరోజు సీబీఐ, ఈడీ కోర్టుల్లో జరిగింది. విచారణ సందర్భంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య... ఇందూ టెక్ జోన్ కేసులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్ నుంచి తనను తొలగించాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు తదుపరి విచారణ నాటికి డిశ్చార్జ్ పిటిషన్లను దాఖలు చేసేందుకు అనుమతించాలని జగన్, విజయసాయి రెడ్డి, కార్మెల్ ఏషియా కంపెనీలు కోరాయి. దీంతో ఈ కేసును కోర్టు జులై 1కి వాయిదా వేసింది.