Daggubati Suresh Babu: సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబును మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

Man who cheated Daggubati Suresh Babu arrested
  • సురేశ్ బాబును మోసం చేసిన నాగార్జున రెడ్డి
  • పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన పలు విషయాలు
  • 10 మంది ప్రముఖులను మోసం చేసినట్టు గుర్తించిన పోలీసులు
కరోనా వ్యాక్సిన్ టీకాలు ఇప్పిస్తానంటూ ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబును ఓ వ్యక్తి మోసం చేసిన సంగతి తెలిసిందే. ఆయన వద్ద నుంచి లక్ష రూపాయలు వసూలు చేసి, పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తును ప్రారంభించారు. మోసం చేసిన నాగార్జున రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.

ఇక అతనిని విచారించే క్రమంలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదే విధంగా అతను పలువురిని మోసం చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఒక ప్రముఖ వస్త్ర దుకాణం యజమానిని కూడా అతను మోసం చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. తెలంగాణకు చెందిన ఓ మంత్రి పేరుతో మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు. నాగార్జునరెడ్డి ఇప్పటి వరకు దాదాపు 10 మంది ప్రముఖులను మోసం చేసినట్టు తెలుస్తోంది.
Daggubati Suresh Babu
Tollywood
Cheating
Arrest

More Telugu News