: క్రికెటర్లకు మోడళ్ళతో పసందైన 'విందు'
కాసులవర్షం కురిపించే ఐపీఎల్ లో కళ్ళు తిరిగే అవినీతి బట్టబయలుకాగా.. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే విషయాలు వెలుగుచూస్తున్నాయి. బుకీలతో సంబంధాలున్నట్టు ఆరోపణలెదుర్కొంటూ, ఈ కుంభకోణంలో అరెస్టయిన బాలీవుడ్ నటుడు విందూ సింగ్ ల్యాప్ టాప్ ను పరిశీలించగా.. కొందరు మోడళ్ళు, ఎస్కార్ట్ గాళ్స్ ఫొటోలు కనిపించాయి. వారి గురించి పోలీసులు విందూను ఆరాతీయగా ఆశ్చర్యకరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. విందూ మోడళ్ళను ఎరగావేసి క్రికెటర్లను ఫిక్సింగ్ ఉచ్చులోకి లాగేవాడని పోలీసులు అంటున్నారు.
అంతేగాకుండా, బుకీలకు క్రికెటర్లకు మధ్య సంధానకర్తగా కూడా వ్యవహరించాడని వారు తెలిపారు. కాగా, విందూ ఇద్దరు మోడళ్ళను పలుసార్లు విదేశాలకు పంపడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. అందుకు కారణాలేమిటో క్రైమ్ బ్రాంచ్ విచారణలో తేలాల్సి ఉంది.