Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. బుధవారం నుంచి అందుబాటులోకి ఎంఎంటీఎస్ రైళ్లు

Hyderabad MMTS Trains will run form day after tomorrow

  • కరోనా కారణంగా 15 నెలల క్రితం ఆగిపోయిన ఎంఎంటీఎస్ సేవలు
  • 10 రైళ్లు నడిపేందుకు అనుమతి ఇచ్చిన రైల్వే మంత్రిత్వ శాఖ
  • లింగంపల్లి-ఫలక్‌నుమా, లింగంపల్లి-హైదరాబాద్ రూట్లలో సేవలు

భాగ్యనగరవాసులకు ఇది శుభవార్తే. కరోనా కారణంగా 15 నెలల క్రితం ఆగిపోయిన ఎంఎంటీఎస్ రైళ్లు మళ్లీ కూతకు రెడీ అవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంతో వీటిని పట్టాలెక్కించాలని అధికారులు నిర్ణయించారు.

ఎల్లుండి (బుధవారం) నుంచి పది ఎంఎంటీఎస్ రైళ్లను నడపడానికి రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతానికి 10 రైళ్లు మాత్రమే అందుబాటులోకి రానున్నా మున్ముందు పరిస్థితులను బట్టి వాటిని పెంచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

అందుబాటులోకి రానున్న రైళ్లలో మూడు ఫలక్‌నుమా నుంచి లింగంపల్లికి, లింగంపల్లి నుంచి ఫలక్‌నుమాకు మూడు, హైదరాబాద్ నుంచి లింగంపల్లికి రెండు, లింగంపల్లి నుంచి హైదరాబాద్‌కు రెండు రైళ్లు నడవనున్నాయి. ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వెళ్లే తొలి రైలు ఉదయం 7.50 గంటలకు బయలుదేరనుండగా, లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లే తొలి రైలు ఉదయం 9.20 గంటలకు బయలుదేరుతుంది. లింగంపల్లి నుంచి హైదరాబాద్ వెళ్లే మొదటి రైలు ఉదయం 8.43 గంటలకు బయలుదేరనుండగా, హైదరాబాద్ నుంచి లింగంపల్లి వెళ్లే రైలు ఉదయం 9.36 గంటలకు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News