: నకిలీ కరెన్సీ ముఠాల హల్ చల్
రాష్ట్రంలో నకిలీ కరెన్నీ చెలామణీ పెరిగిపోతోంది. ఇందుకు నిదర్శనంగా రెండు రోజుల వ్యవధిలో మూడు ప్రాంతాలలో మూడు ముఠాలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న నలుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. వారి నుంచి లక్ష రూపాయల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోనూ నకిలీ నోట్లను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 1.50లక్షల విలువజేసే నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక, కంప్యూటర్, ప్రింటర్ల సాయంతో నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తూ మార్కెట్లోకి విడుదల చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను గుంటూరు పోలీసులు గురువారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.