Raviteja: చిత్తూరు యాసలో సందడి చేయనున్న రవితేజ!

Raviteja talks in chittooru slang in his next movie

  • విడుదలకి సిద్ధమవుతున్న 'ఖిలాడి'
  • శరత్ మండవకు దర్శకుడిగా ఛాన్స్
  • పాతికేళ్ల క్రితం జరిగే కథ
  • కథానాయికగా 'దివ్యాన్ష కౌశిక్'  

రవితేజ డైలాగ్ డెలివరీ చాలా సహజంగా ఉంటుంది .. ఎలాంటి డైలాగులైనా ఆయన అలవోకగా చెప్పేస్తూ ఉంటాడు. అలాంటి రవితేజ ఈ సారి చిత్తూరు యాసలో సందడి చేయనున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆయన ఆ యాసలో డైలాగ్ చెప్పే సినిమా ఏదయ్యా అంటే, అది త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న శరత్ మండవ సినిమా. 'ఖిలాడి' తరువాత రవితేజ చేయనున్న సినిమా ఇది. ప్రస్తుతం ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సంబంధించిన సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి.

శరత్ మండవ ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా కోసం ఆయన ఎంచుకున్న కథ చాలా కొత్తగా ఉందట. పాతికేళ్ల క్రితం జరిగే కథ ఇది. అప్పటి పరిస్థితుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. రవితేజ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. ఇక ఆయన చిత్తూరు యాసలో మాట్లాడతాడనే విషయం తాజాగా బయటికి వచ్చింది. ఈ డైలాగ్ డెలివరీతో ఆయన ఎలా చెలరేగిపోతాడో చూడాలి. వినోదభరితమైన ఈ సినిమాలో కథానాయికగా 'దివ్యాన్ష కౌశిక్'ను తీసుకున్నారు. సామ్ సీఎస్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని అంటున్నారు.

  • Loading...

More Telugu News